ఎస్ యూవీతో వచ్చారు ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

Update: 2019-12-16 04:20 GMT

ఏటీఎం దగ్గరే కూర్చుని దోపిడీ చేయటం అంటే చాలా కష్టం కదా?. సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. అక్కడికి అక్కడే పగలు గొట్టడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఒక రకంగా అది అసాధ్యమే. అందుకే దొంగలు ఓ కొత్త మోడల్ ఫాలో అయ్యారు. ఓ ఎస్ యూవీలో దిగారు. అందులో ఏటీఎంను వేసుకుని వెళ్లిపోయారు. ఇది పూణేలు జరిగింది. పూణేలోని మలూంజీలో ఆదివారం తెల్లవారు జామున 2.20 గంటలకు దొంగలు తమ పని పూర్తి చేసుకున్నారు.

దొంగలు ఏటీఎంను ఎత్తుకెళ్లేందుకు అవసరమైన పరికరాలతో సహా వచ్చారని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు పెట్రోలింగ్ టీమ్ లను అప్రమత్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు.

 

 

 

Similar News