కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి అమరావతి తరలింపుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని..ఇందులో ఎలాంటి హేతుబద్దత లేదని విమర్శించారు. ఆయన శుక్రవారం నాడు హైదరాబాద్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలసి అమరావతి అంశంపై ఫిర్యాదు చేశారు. త్వరలోనే ఢిల్లీలో రాష్ట్రపతిని కలసి ఓ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఏడు నెలల్లో ఏపీ సర్కారు పరిపాలనపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవన్నారు. అధికార, ప్రతిపక్షాలు అదే రీతిలో వ్యవహరిస్తున్నాయి.
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఆదారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని కోరినా కూడా ఇంత వరకూ ఎలాంటి చర్యలేవన్నారు. కేసులు పెడితే తాను వాటిన తేల్చుకోవటానికి రెడీ అన్నారు. ప్రజలకు మంచి జరగాలన్నదే బిజెపి విధానం అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి కానీ..పరిపాలన వికేంద్రీకరణ కాదన్నారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు కూడా అంత ఈజీ కాదని..ఇందులో పలు అంశాలు ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి..ఇతర చర్యలతో అభివృద్ధి చేయాలన్నారు.