పాటల విషయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ వెనకబడినట్లే కన్పిస్తోంది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న అల...వైకుంఠపురములో , సరిలేరు నీకెవ్వరు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కానీ పాటల విషయంలో మాత్రం అల..వైకుంఠపురములో దూసుకెళుతుండగా..సరిలేవరు నీకెవ్వరు మాత్రం పాటల రేసులో వెనకబడింది. ఈ సినిమాలో ఇప్పటివరకూ విడుదలైన ‘హీ ఈజ్ సో క్యూట్..ఈ హీజ్ సో స్వీట్’ మాత్రం ఆకట్టుకుంటోంది. మిగిలిన పాటలు అన్నీ కూడా ఓ మోస్తరుగా మాత్రమే ఉన్నాయి. తాజాగా సోమవారం నాడు మరో పాటను విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌గా విడుదలైన ఈ పాట ఆర్మీ జవానుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఉంది.
‘భగభగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటునే దూకేవాడె సైనికుడు’ అంటు సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ యూరప్ వెళ్లి అక్కడి కళాకారులతో కంపోజ్ చేశాడు. ఎంతో అత్యద్భుతంగా సాగిన ఈ పాట యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=12TBkQvBQ8s
.