‘ఎవరికి రా ఫోన్ చేస్తున్నావు. ఫైర్ ఇంజన్ కా?. ఫైరింజన్ కు కాదు..ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా. ఎవడ్రా ఫైర్’ అని విలన్ అడగ్గానే హెలికాఫ్టర్ లో బాలకృష్ణ ఎంట్రీ.’ ఈ ఎంట్రీతోనే ‘రూలర్ ’ సినిమా ట్రైలర్ స్టార్ అవుతుంది. ఆసక్తికర సీన్లు..రిచ్ నెస్, బాలకృష్ణ అభిమానులు కోరుకునే పవర్ ఫుల్ డైలాగ్ లు..ఫైట్లతో నిండిపోయింది ఈ ట్రైలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఆదివారం చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఇది దెబ్బతిన్న సింహాంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది’ అంటూ బాలయ్య పలికే డైలాగు ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?time_continue=2&v=T-Hg8HzWM8M&feature=emb_logo