సెన్సార్ బోర్డు సభ్యులపై వర్మ పరువు నష్టం దావా

Update: 2019-12-16 09:25 GMT

నిత్యం ఏదో ఒక వివాదాలతో కాలక్షేపం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏకంగా సెన్సార్ బోర్డు సభ్యులపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. తన సినిమాకు అడ్డుపడిన వారిపై 20 కోట్ల రూపాయల పరువు నష్టం వేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు అడ్డుపడిన వారిలో ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ చేయగా..కొన్ని ఆధారాలు లభించాయని తెలిపారు.

వారిపై చర్యలకు సిద్ధమైనట్లు తెలిపారు. సకాలంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదల చేయలేకపోయినందున నిర్మాతలకు కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని తెలిపారు. ఈ సినిమా విడుదలలో రెండు వారాలు విడుదలలో జాప్యం అయిందని వెల్లడించారు. ఈ సినిమాపై చాలా కుట్రలు జరిగాయని తెలిపారు. అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ పెట్టిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు వర్మకు నోటీసులు జారీ చేశారు.

 

 

Similar News