తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అసెంబ్లీలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. డెబ్బయి సంవత్సరాలు వయస్సు వచ్చినా ఆయన ఇంకా తమతో తిట్లు తినే పరిస్థితి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాని విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నా వయసు 70 సంవత్సరు కావొచ్చు. 25 ఏళ్ల కుర్రాడికి ఉన్న ఆలోచనలు నాకు ఉంటాయి. మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టే వరకు విశ్రమించబోను. 150 ఎమ్మెల్యేలు దాడి చేసినా సమాధానం చెప్పే శక్తి నాలో ఉంది. నా దగ్గర మైండ్ గేమ్స్ చెల్లవు. జగన్ మైండ్ గేమ్స్ బాగా ఆడుతారు. వరుణ దేవుడిని కూడా జైలుకు తీసుకెళ్తారనే భయంతో వర్షాలు పడుతున్నాయి’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.