ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి సీఎం జగన్ ప్రకటనను స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని..ఇది సరైన నిర్ణయం అని వ్యాఖ్యానించారు. కర్నూల్ లో హైకోర్టు ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం తాము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని తెలిపారు.