ఏపీ రాజధానిపై జగన్ సంచలన ప్రకటన

Update: 2019-12-17 13:07 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏపీకి మూడు రాజధాని ఉంటాయోమో అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజధాని అంశంపై జరిగిన చర్చలో భాగంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఆఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. బహుశా ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అంటూనే ప్రసంగం చివరలో "అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటా" అంటూ వ్యాఖ్యానించారు.

అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ ఉంటుందని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ ఉంటుందని అన్నారు. కర్నూలులో హైకోర్టు ఉంటుందని తెలిపారు. రకరకాల ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. మన దగ్గర డబ్బులు లేవని..చంద్రబాబు సేకరించిన అమరావతిలో క్యాపిటల్ డెవలప్ చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు రావాలని..అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఎక్కడ ఉందని తెలిపారు. ఇఫ్పటికే సేకరించిన అప్పులకే కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ తరుణంలో మనం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. వైజాగ్ లో ఓ మెట్రో రైలు వేస్తే సరిపోతుందని అన్నారు. మిగతా అన్ని సౌకర్యాలు వైజాగ్ లో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

 

Similar News