జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు బిజెపితోతాను ఎప్పుడూ దూరంగా లేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలోనే బిజెపితో విభేదించినట్లు తెలిపారు. అందుకే బిజెపికి దూరం వచ్చా. అందుకే ఒంటరిగా పోటీ చేశానని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంటే వైసీపీ నేతలకు భయం..తనకు గౌరవం అన్నారు. బిజెపితో జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీ వచ్చేదా? అని ప్రశ్నించారు. నా పట్ల వైసీపీ నేతలు కృతజ్ణతతో ఉండాలని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, బిజెపి, తాను కలసి పోటీచేస్తే ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎక్కడ ఉండే వాళ్ళో ఊహించుకోవాలి. టీడీపీతో అంత గొడవ పెట్టుకున్నాక కలసి ఎలా పోటీచేస్తాం. ఎంత మంది వైసీపీ నాయకులు తనకు కబురు పంపారో తనకే తెలుసన్నారు. ఆ పేర్లు సరికాదనే బయట పెట్టడం లేదని తెలిపారు. సీపీ నేతలు మాకు దండం పెట్టాలన్నారు. ఏపీలో పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మంగళవారం నాడు కూడా పవన్ కళ్యాణ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం దేశానికి మోడీ, అమిత్ షా వంటి నాయకులే కావాలని వ్యాఖ్యానించారు.