ఏపీకిమూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. గురువారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మీడియా దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మనసులోని ఆలోచనను బయటపెట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే జగన్ ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు.