ఆ భూమి ఏమి చేస్తామో త్వరలో చెబుతాం

Update: 2019-12-26 16:37 GMT

అమరావతిలో రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల భూమిని ఏమి చేసేది త్వరలోనే చెబుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమకు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచనలేదన్నారు. తమ రాజధాని గ్రాఫిక్స్ లో ఉండదని..వాస్తవరూపంలో ఉంటుందని తెలిపారు. ఆయన గురువారం నాడు మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలసి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో 50 శాతం దాటిన భవనాలను పూర్తి చేస్తామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కరిస్తామని..ఈ అంశంపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఐదేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతిలో ఇళ్ళు ఎందుకు కట్టుకోలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఓ మీడియా ప్రతినిధి బొత్సను ఏపీ రాజధానిపై నెలకొన్న గందరగోళానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఏపీ రాజధాని ఏదని అడిగిన ప్రశ్నకు బొత్స ఒకింత ఆలోచించి... ‘రేపు ఆగితే ఎల్లుండి చెబుతాం ఎక్కడనేది’ అని మంత్రి బొత్స సమాధానాన్ని దాటవేశారు. రాజధాని రైతులకు వచ్చిన నష్టం ఏమీ లేదని, అమరావతి నుంచి సచివాలయం ఒక్కటే కదా పోతోందని మంత్రి వ్యాఖ్యానించారు.

 

 

Similar News