ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్ళనున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్‌ పోర్ట్‌ కు చేరుకుంటారు. జన్‌పథ్‌‌-1లో రాత్రి బస చేస్తారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటన సడన్ గా ఖరారు అయిందా..ముందస్తుగా అనుకున్నదేనా అన్న అంశంలో స్పష్టత లేదు.