అమరావతిలో ‘ఉద్రిక్తత’ ....రోడ్డెక్కిన రైతులు

Update: 2019-12-18 06:56 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అమరావతి రైతుల్లో కలకలం రేపుతోంది. దీంతో రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులు రోడ్డు మీదకు వచ్చారు. రాజధానిని మూడు చోట్లకు మారుస్తామంటే ఇది తమకు అన్యాయం చేయటమే అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు పురుగుల మందు బాటిళ్ళు తీసుకుని వచ్చారు. అయితే పోలీసులు ఈ పురుగు మందుల డబ్బాలను లాక్కునే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో పోలీసులు..రైతులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. అమరావతిలో రైతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు రైతులు తక్షణమే మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతులు రోడ్డెక్కటంతో సచివాలయం వైపు వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు చోటుచేసుకున్నాయి. కృష్ణాయపాలెం, మందడం, తూళ్లూరు ప్రాంతాల్లో రైతులు ధర్నాలకు దిగారు.

 

 

 

Similar News