చంద్రబాబు దీక్షకు కన్నా మద్దతు కోరిన టీడీపీ

Update: 2019-11-11 09:41 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ‘ఇసుక దీక్ష’కు ఆ పార్టీ బిజెపి మద్దతు కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా సోమవారం నాడు కన్నాతో భేటీ అయ్యారు. చంద్రబాబునాయుడు ఈ నెల 14న చంద్రబాబు ధర్నాచౌక్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షకు కూర్చోనున్నారు.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వైజాగ్ లో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బిజెపి కూడా ఇసుక కొరతపై ధర్నాలు..దీక్షలకు దిగింది. మరి టీడీపీ వినతిపై బిజెపి ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

 

Similar News