శివసేన సంచలన వ్యాఖ్యలు

Update: 2019-11-03 10:44 GMT

మహారాష్ట్ర సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ దిశలో బిజెపి మిత్రపక్షం సంచలన వ్యాఖ్యలు చేసింది. తమకు 170 మంది మద్దతు ఉందని..ఈ సంఖ్య 175కు కూడా చేరొచ్చని ఆ పార్టీకి చెందిన కీలక నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తాము తలచుకుంటే బీజేపీ అవసరం లేకుండా సోమవారం లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నవంబర్‌ 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. దీనిపై కూడా శివసేన మండిపడింది. రాష్ట్రపతి బిజెపి జేబులో ఉన్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 50:50 ఫార్ములాకే శివసేన పట్టుబట్టడం, అవసరమైతే రాష్ట్రపతిపాలనకైనా సిద్ధపడతామని బీజేపీ తేల్చి చెప్పడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ముందుకు సాగటం లేదు.

మరో వైపు శివసేన పవార్‌తో పవర్‌ పంచుకుంటామనే సంకేతాలు పంపుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీయే అని ఫడ్నవిస్‌ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో కాంగ్రెస్‌ నేతలు చర్చలు జరుపుతున్నారు. సోమవారం సోనియా గాంధీలో పవార్‌ భేటీ కానున్నారు. అయితే కేంద్ర హోం మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగితే తప్ప వ్యవహారం కొలిక్కివచ్చేలా లేదని చెబుతున్నారు.

 

Similar News