వంశీ పార్టీ మారినా నష్టం లేదు..లోకేష్

Update: 2019-11-15 11:59 GMT

వల్లభనేని వంశీ టీడీపీని వీడినా పార్టీకి నష్టం ఏమీ లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వారం క్రితం నాతో మాట్లాడి ఇప్పుడు నాపై విమర్శలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. 2009 నాటి జూనియర్ ఎన్టీఆర్ అంశం ఇప్పుడు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. భూమి వివాదం కారణంగానే వల్లభనేని వంశీ పార్టీ మారారని లోకేష్ వ్యాఖ్యానించారు.

వంశీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, ఆయన ఆరోపిస్తున్న వెబ్ సైట్లకు తనకూ ఎలాంటి సంబంధంలేదని లోకేష్ తెలిపారు. ఎవరో ఏదో రాస్తే తనకేమి సంబంధం అన్నారు. గతంలో జగన్ పై తీవ్ర విమర్శలు చేసి..ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. నారా లోకేష్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Similar News