మహారాష్ట్ర పరిణామాలు..లోక్ సభలో తీవ్ర గందరగోళం

Update: 2019-11-25 05:46 GMT

మహారాష్ట్ర పరిణామాలు సోమవారం నాడు లోక్ సభను కుదిపేశాయి. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే కాంగ్రెస్ తోపాటు శివసేన ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కల్పించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలు సాగే పరిస్థితి ఏ మాత్రం కన్పించకపోవటంతో స్పీకర్ సభ ప్రారంభం అయిన వెంటనే వాయిదా వేశారు. కాంగ్రెస్, శివసేనలో ఇదే అంశంపై లోక్ సభలో బయటా, లోపల ఆందోళనలకు దిగాయి. ఇందులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలుసోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ, పార్టీ ఎంపీలు అందరూ పాల్గొన్నారు.

బిజెపి మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్ సభ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటాన్ని ఆపండి అంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నిరసనకు దిగింది. విపక్షాలు కూడా కాంగ్రెస్ కు సంఘీభావం ప్రకటించాయి. లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ నిరసనలు హోరెత్తాయి. దీంతో రాజ్యసభను కూడా వాయిదా వేశారు.

Similar News