మాజీ మంత్రి, సీనియర్ నేత పసుపులేటి బాలరాజు జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ఐదు నెలల పాటు పార్టీలో మీత కలసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని లేఖలో పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు వేధనాభరితమైనా తీసుకోకతప్పని పరిస్థితి ఉందని..అందుకే ఇక నుంచి పార్టీలో కొనసాగలేనని పేర్కొన్నారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ సమక్షంలో పార్టీలో చేరిన బాలరాజు.. పాడేరు అసెంబ్లీ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఓ వైపు జనసేన ఇసుక సమస్యపై విశాఖపట్నంలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేయటం కీలకంగా మారింది.