సుప్రీం సంచలన తీర్పు

Update: 2019-11-13 09:23 GMT

సుప్రీంకోర్టు బుధవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు చెందిన ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) కార్యాలయం కూడా సమాచార హక్కుచట్టం పరిధిలోకి వస్తుందని తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.దీంతో 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించినట్లు అయింది.

ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయగా..దీనిపై పలుమార్లు వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నాడు తుది తీర్పు వెలువరిస్తూ ఈ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో పారదర్శకత విషయంలో ఎవరూ అతీతులు కారనే సందేశాన్ని పంపినట్లు అయింది. అయితే సీజెఐ కార్యాలయం నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం పొందటానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. దేశ భద్రతతోపాటు ఇతర కీలక అంశాలపై అందే సమాచారం మాత్రం బయటకు ఇవ్వరు.

 

Similar News