సుప్రీంకోర్టు సీజెగా బాబ్డె..రాష్ట్రపతి ఆమోదం

Update: 2019-10-29 06:42 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజె)గా శరద్ అరవింద్ బాబ్డే నియామకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ప్రతిపాదిత ఫైల్ పై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సంతకం చేశారు. ప్రస్తుతం సీజెగా ఉన్న జస్టిస్ రంజన్ గోగొయ్ తర్వాత సీనియర్ అయిన బాబ్డే పేరును సీజెగా ప్రతిపాదిస్తూ ఫైలు పంపారు. నవంబర్‌ 18న బాబ్డే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుతమున్న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబర్‌ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే వివాదాస్పద అయోధ్య కేసులో తుది తీర్పు వెలువడనుంది. ఈ చారిత్రక తీర్పు వెలువరించిన తర్వాత రంజన్ గొగోయ్ బాధ్యతల నుంచి వైదొలగుతారు. ఈ కేసుకు సంబంధించిన ఆయన నేతృత్వంలోని బెంచ్ సుదీర్ఘ వాదనలు విన్నది.

 

Similar News