ఈ సినిమాపై కాస్తో కూస్తో హైప్ క్రియేట్ అయింది అంటే అది హీరోయినేతోనే. ఆ హీరోయినే ఆర్ఎక్స్ 100తో కుర్రకారు మనసు దోచిన భామ పాయల్ రాజ్ పుత్. ఇప్పుడు ఆర్ డీఎక్స్ లవ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వైపు ప్రేక్షకులు ఎవరైనా చూశారు అంటే అది కూడా పాయల్ రాజ్ పుత్ కారణంగానే అని చెప్పకతప్పదు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాయల్ రాజ్ పుత్ చిత్రాలు యూత్ లో అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో హీరో తేజాస్ కంచర్ల. అయినా అందరి చూపు మాత్రం హీరోయిన్ పాయల్ వైపే. ఆర్ డీఎక్స్ లవ్ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆర్ డీఎక్స్ లవ్ సక్సెస్ అయిందా అంటే టైటిల్ లో ఎంతో ఇంటెన్సిటి ఉంది. కానీ ప్రేమలో కానీ..కథలో కానీ ఎక్కడా పెద్దగా ‘పేలుడు’ పదార్ధాలు కన్పించవు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఓ గ్రామం. ఆ గ్రామానికి బ్రిడ్జి లేకపోవటం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఏ అవసరం కోసం అయినా వంద కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. బ్రిడ్జి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కావు. చివరకు ఆ గ్రామానికి చెందిన అమ్మాయిలు కొంత మంది సామాజిక సేవ చేస్తూ ముఖ్యమంత్రి దృష్టిలో పడి..వాళ్ల ఊరి సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తారు. దీని కోసం హీరోయిన్...ఆమె టీమ్ అపరిచితులతో శృంగారం తప్పు అంటూ కండోమ్స్ పంచి పెడుతూ తిరుగుతారు.
సినిమాలోని ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అన్పిస్తాయి. ఆ తర్వాత ఓ గ్రామంలో అసలు ఎవరికి పిల్లలు పుట్టడంలేదని తెలుసుకుని..దానికి కారణం అయిన మద్యం మహమ్మారిని మాన్పించటానికి వెళ్లి అక్కడ చేసే ప్రయత్నాలు కూడా ఏ మాత్రం సహజంగా అన్పించకపోగా..ఒకింత అసహనం కలిగిస్తాయి. తర్వాత గుట్కా మాన్పించేందుకు హీరోయిన్ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎలాగోలా సీఎం దగ్గరకు వెళ్ళి తమ ఊరి సమస్యను పరిష్కరిస్తారు. అయితే ఈ మధ్యలో హీరో..హీరోయిన్ లవ్ ట్రాక్..అందులో ట్విస్ట్ లు ఏ మాత్రం ఆకట్టుకునేలా ఉండవు. డైరక్టర్ శంకర్ భాను సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. పాయల్ రాజ్ పుత్ కొన్ని పాటల్లో చేసిన ఎక్స్ పోజింగ్ నే దర్శకుడు నమ్ముకున్నట్లు కన్పిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఆర్ డీఎక్స్ లవ్ పెద్దగా ‘పేలలేదనే’ చెప్పాలి.
రేటింగ్. 1.75/5