గవర్నర్ కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ

Update: 2019-10-05 12:00 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం అవినీతిపై మండిపడ్డారు. కెసీఆర్ సర్కారుకు ప్రచారంపై ఉన్న యావ ప్రాజెక్టులపై లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని హంగామా చేశారని..కానీ ఇప్పటి వరకూ కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చుక్క నీరు వదలలేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 4657.95 కోట్ల రూపాయల పనులను నామినేషన్ పై ఎలా అప్పగిస్తారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ మేరకు ఆయన తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు పేరుతో భారీ అవినీతి జరుగుతోందని..దీన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ పై వేల కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇందుకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు.

Similar News