చంద్రబాబు మూతిపై వాత పెట్టాలి

Update: 2019-10-10 11:05 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడితే పులివెందుల పంచాయతీ..పులివెందుల పంచాయతీ అనటంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. భవిష్యత్ లో కూడా ఇలాగే మాట్లాడితే పౌరుషానికి నిలయమైన పులివెందుల ప్రజలు అట్లకాడ కాల్చి చంద్రబాబు మూతిపై వాత పెట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబు వ్యాఖ్యానించారు. పులివెందుల రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ప్రాంతం అని ..రాయలసీమను..పులివెందులను విమర్శించేలా చంద్రబాబు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. అసలు పులివెందుల పంచాయతీ ఏంటి?.ఎవరు పంచాయతీలు చేస్తున్నారు అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ పారదర్శక పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నేతల మధ్య పంచాయతీలుచేసింది..బ్రోకరేజ్ చేసింది చంద్రబాబే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్యాలెన్స్ గా వ్యవహరించకపోతే మరోసారి గుఠపాఠం చెబుతారు ప్రజలు.

మీరు పిచ్చివాగుడు వాగితే జగన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్రేషన్ తో చేసే విమర్శలకు మీకు సమాధాన చెప్పాల్సిన పరిస్థితిలో లేరు. ఆయనకు ఐదేళ్ల పాటు పాలన అందించే అవకాశం ప్రజలు ఇఛ్చారు. జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అధికారంలో ఉండగా వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డిల మధ్య పంచాయతీ చేసింది చంద్రబాబే అన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య పంచాయతీ చేసింది కూడా చంద్రబాబే అన్నారు. దీంతోపాటు జగన్ ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా ప్రతిదీ తామే ప్రారంభించామని చెప్పటం చంద్రబాబుకు ఓ అలవాటుగా మారిందని అన్నారు. ఓటమి నైరాశ్యం నుంచి ఆయన ఇంకా బైటకు వచ్చినట్లు కన్పించటంలేదని ఎద్దేవా చేశారు. జగన్ సర్కారు రౌడీ ప్రభుత్వం, నేరస్తుడు అనటానికి అంబటి రాంబాబు తప్పుపట్టారు. రాజశేఖరరెడ్డి చంద్రబాబును చూసి భయపడ్డాడని చెప్పుకోవటం విచిత్రంగా ఉందన్నారు.

 

 

Similar News