సచివాలయ ఉద్యోగాల పేపర్ లీక్ వార్తలపై అధికార వైసీపీ మండిపడుతోంది. జగన్ అవినీతి రహిత పాలనను చంద్రబాబు చూడలేకపోతున్నాడని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. విశ్వసనీయతలేని చంద్రబాబు మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు. పారదర్శకంగా లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఓ లెటర్ రాస్తే మీడియాలో వస్తుందని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నాడు. ఏనాడైనా లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా?. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల గుండెల్లో జగన్మోహనన్ రెడ్డి ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల గుండెల్లో ఉన్నారు. నువ్వు ఏమి చెప్పినా నీ వేమూరి రాధాకృష్ణ బూతు పత్రిక, బూతు ఛానల్ ఏమి చెప్పినా ప్రజలు నమ్మరు. వేమూరి రాధాకృష్ణ ఖబడ్డార్. పేపర్ ఎక్కడ నుంచి లీక్ అయిందో చెప్పాలి?. ఎవరు లీకు చేశారో చెప్పాలి. మా వర్గ ప్రజలకు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఓర్చుకోలేని వారు.. ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలి. లేదంటే క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలి. బడుగు, బలహీనవర్గాలకు ఉద్యోగాలు వస్తే తట్టుకోలేకే విమర్శలు చేస్తున్నారు. జగన్ కు లేఖ రాయటానికి చంద్రబాబు అసలు అర్హత ఉందా? అని జోగి రమేష్ ప్రశ్నించారు.