అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)బోర్డులో తొలిసారి తెలంగాణకు చెందిన ప్రముఖులకు పెద్ద పీట వేశారు. ఇందులో తెలంగాణ సీఎం కెసీఆర్ కు అత్యంత సన్నిహితులైన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. తెలంగాణకు ప్రాతినిధ్యం ప్రతిసారి ఇవ్వటం ఆనవాయితీనే అయినా..ఇంత భారీ స్థాయిలో తెలంగాణ ప్రాంతం నుంచి బోర్డు సభ్యులకు చోటు కల్పించటం ఇదే మొదటిసారి అని చెప్పకతప్పదు.
ఈ సారి కూడా టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు...కాంట్రాక్టర్ల కుటుంబాలకు పెద్ద పీట దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు జీవో జారీ చేసింది. 28 మందితో పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. వీరిలో 24 మంది పాలక మండలిసభ్యులుగా, నలుగు ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. కొత్త బోర్డు సభ్యులు అందరూ శనివారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా..
1.కే.పార్థసారథి (ఎమ్మెల్యే)
2.యూవీ రమణమూర్తిరాజు (ఎమ్మెల్యే)
3.ఎం.మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే)
4.పరిగెల మురళీకృష్ణ
5.కృష్ణమూర్తి వైద్యనాథన్
6.నారాయణస్వామి శ్రీనివాసన్
7.జే.రామేశ్వరరావు
8.వి. ప్రశాంతి
9.బి.పార్థసారథిరెడ్డి
10.డాక్టర్ నిచిత ముప్పవరపు
11.నాదెండ్ల సుబ్బారావు
12.డీ.పీ.అనంత
13.రాజేష్ శర్మ
14.రమేష్ శెట్టి
15గుండవరం వెంకట భాస్కరరావు
16.మూరంశెట్టి రాములు
17.డి.దామోదర్‌రావు
18.చిప్పగిరి ప్రసాద్‌కుమార్
19.ఎంఎస్ శివశంకరన్
20.సంపత్ రవి నారాయణ
21.సుధా నారాయణమూర్తి
22.కుమార గురు (ఎమ్మెల్యే)
23.పుట్టా ప్రతాప్‌రెడ్డి
24.కె.శివకుమార్
ఎక్స్ అఫీషియో సభ్యులు :
1.రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్)
2.దేవాదాయ శాఖ కమిషనర్
3.తుడా చైర్మన్
4.టీటీడీ ఈవో