తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అండ్‌కోకు పిచ్చి బాగా ముదిరిపోయిందని.. మెంటల్ ఆసుప్రతుల్లో చేర్పించాలని ఎద్దేవా చేశారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది తామేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పు కోవడం సిగ్గుచేటని రోజా మండిపడ్డారు. తిరుపతిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
పాదయాత్రలో గిరిజనులకు ఇచ్చిన మాట మేరకు ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఐదు జీవోలు ద్వారా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చంద్రబాబు చేసిన తప్పు వలన ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతుల్లో చనిపోయారని చెప్పారు.