దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ అంత్య క్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆదేశించారు. బుధవారం నాడు నరసరావుపేటలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కోడెల ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ స్పీకర్ అంత్యక్రియల విషయంలో నిర్ణయం సరైన తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆయనపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా...ఆయన చేసిన పదవికి గౌరవం ఇచ్చి జగన్ సముచిత నిర్ణయం నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.