జగన్ ఏమైనా ప్రతివతా?

Update: 2019-09-20 10:55 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏమైనా ప్రతివతా?. నిజాయతీపరుడా.. నీతిమంతుడులా ఆయన చెబుతుంటే మేం వినాలా? అంటూ వ్యాఖ్యానించారు. గత ముఖ్యమంత్రులంతా తెలివిలేని వాళ్లా?, పోలవరం టెండర్‌ షెడ్యూల్‌లో ఎందుకు మార్పులు చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల కల అని వ్యాఖ్యానించారు. ఒకరిని దృష్టిలో పెట్టుకుని రీ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఇంత భారీ ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్‌కు పోలేదని తెలిపారు. సీఎం బంధువు పీటర్ ఇచ్చిన నివేదక ఆధారంగా ముందుకు పోతున్నారన్నారు. కేంద్రం చెప్పినా, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకు పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెర్రరిస్ట్‌ ప్రభుత్వాన్ని చూసి మీడియా భయపడుతోందన్నారు. పీపీఏ, సీపీసీ గైడెన్స్‌ వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలన్నారు.

గోదావరిలో బోటు మునిగిపోతే ఇంత వరకూ కనిపెట్టలేని వాళ్లు పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం కూడా పెరుగుతుందని నిపుణులు కూడా తేల్చారన్నారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదన్నారు. మా ఇంటికి నోటీస్ అంటించిన అంత సులువుగా ...పోలవరం కట్టడం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎంకి చేతకాకపోతే నిపుణులు చెప్పింది అయినా వినాలన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 71 శాతం పోలవరం పనులు పూర్తిచేశాంమన్నారు.

24గంటల్లో 32,350క్యూ.మీ కాంక్రీట్ ఫిల్లింగ్ గిన్నెస్ రికార్డుతో పాటుగా దేశంలోనే బెస్ట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అవార్డు సాధించాం. ఇంకో ఏడాది కష్టపడితే పూర్తయ్యే దశకు చేర్చాం. అలాంటిది ఇప్పుడు వైసిపి విధ్వంసక చర్యలతో ప్రాజెక్టు పనులు నిలిపేయడం జరిగింది. మేము ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సిన పనిలేదు, కేంద్రమే చేస్తుందని ఢిల్లీ వెళ్లి చెప్పారు. తరువాత రివర్స్ టెండరింగ్ అన్నారు. నిజానికి ఇది రివర్స్ టెండరింగ్ కాదు రీటెండరింగ్...రిజర్వ్ డ్ టెండరింగ్..అనుకూల వ్యక్తులకు టెండర్లను రిజర్వ్ చేశారు అని ఆరోపించారు.

Similar News