ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఉండే అక్రమ నివాసమే కాదు.. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలు అన్నీ కూల్చేస్తామని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే అందరికి నోటీసులు జారీ చేశామని..చంద్రబాబు నివాసానికి తాజాగా ఇచ్చింది తుది నోటీసు అని తెలిపారు. సీఆర్ డీఏ అధికారులు సోమవారం నాడు పాతూరి నాగభూషణంకు చెందిన కరకట్ట నివాసంలో ఉన్న ర్యాంప్ ను కూల్చేశారు. అక్రమ నివాసంలో ఉండి చంద్రబాబు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
కరకట్టపై ఉన్నవి సక్రమ నిర్మాణాలు అయితే వారు కోర్టును ఆశ్రయించవచ్చని బొత్స వ్యాఖ్యానించారు. సీఆర్ డీఏ ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించటంతో ఈ వారం లోగానే చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా కూల్చివేత తప్పదనే స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఇళ్ళు కూల్చివేస్తున్నారని కొన్ని ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తున్నాయని బొత్స మండిపడ్డారు.