చంద్రబాబు టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానన్నారా?

Update: 2019-08-08 05:39 GMT

...అంటే ఔననే చెబుతున్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి. అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరు కాదా చంద్రబాబూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా? అంటూ విజయసాయరెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా.

ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారని, పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్‌ మూడేళ్లలో పూర్తయ్యేదన్నారు. 7లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేదని, ప్రధానమంత్రి మోదీ అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదని ఆయన ధ్వజమెత్తారు.

 

Similar News