కాశ్మీర్ దెబ్బ..వణికిన స్టాక్ మార్కెట్లు

Update: 2019-08-05 05:39 GMT

సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచి నష్టాలే చవిచూశాయి. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందన్న సమాచారంతో మార్కెట్ బారీ నష్టాలను మూటకట్టుకుంది. కేంద్ర నిర్ణయం ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై ఎలా ఉంటుంది..అంతర్జాతీయంగా స్పందనలు ఎలా ఉంటాయో అన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగపడ్డారు.

ఇప్పటికే ఆర్ధిక వ్యవస్థ మందగిస్తుందనే వార్తల నేపథ్యంలో కాశ్మీర్ అంశం కూడా జత కావటంతో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంల సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్ల నష్టపోయింది. పది గంటల సమయంలో 500 పాయింట్ల మేర నష్టపోయిన తర్వాత మరింత దిగువకు జారింది.

 

Similar News