పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే యూత్ గుండెల్లో బాంబులు పేల్చింది. ఈ సారి మాత్రం ఏకంగా ఆర్ డీఎక్స్ పేల్చటానికి రెడీ అవుతోంది. అదేంటి అంటారా?. మరి అలా ఉన్నాయి ఆమె లుక్స్. ఆ సినిమా పేరు కూడా ఆర్ డీఎక్స్ లవ్ కావటం విశేషం. తొలి సినిమా ఆర్ఎక్స్ 100లో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ అదిరిన విషయం తెలిసిందే. ఆర్ డీఎక్స్ లవ్ సినిమాలో తేజస్ కంచెర్ల హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు ‘పవర్’ చిత్ర దర్శకుడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌కు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.