ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రదానం

Update: 2019-08-08 15:30 GMT

దేశంలోని అత్యున్నత పురస్కారం అయిన ‘భారతరత్న’ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుకున్నారు. ప్రణబ్ కు ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రదానం చేశారు. 2019 సంవత్సరానికి గాను ప్రణబ్ కు ఈ పురస్కారం ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌లో గురువారం భారతరత్న పురస్కారాల ప్రదానోత్స కార్యక్రమం జరిగింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్‌ముఖ్‌, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాలకు ప్రకటించిన విషయం తెలిసిందే.

నానాజీ, భూపేన్‌ హజారికాలకు కేంద్రం మరణానంతరం భారతరత్న ఈ పురస్కారాన్ని ప్రకటించింది. భూపేన్‌ హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్‌ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

 

Similar News