జమ్మూ కాశ్మీర్ ఇక రెండు ముక్కలు

Update: 2019-08-05 06:45 GMT

కేంద్రంలోని మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయాలతో జమ్మూ,కాశ్మీర్ లు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది. జమ్మూ కాశ్మీర్ లోనూ అసెంబ్లీ ఉంటాయి. కానీ లడఖ్ మాత్రం పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుంది. అక్కడ చట్టసభ ఉండదు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవటం, పార్లమెంట్ లో ప్రకటన..ఆ వెనువెంటనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గెజిట్ జారీ చేయటం చకచకా సాగిపోయాయి. కేంద్రం తాజా నిర్ణయాలతో జమ్మా కాశ్మీర్‌ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేస్తూ పలు వివరాలు వెల్లడించారు.

జమ్ము కాశ్మీర్‌ను రెండు ముక్కలు చేసేలా జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లడఖ్‌ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని అమిత్‌ షా చెప్పారు. కేంద్రం నిర్ణయంతో కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని కోల్పోయినట్లు అయింది. ఆర్టికల్‌ 370పై పక్కా వ్యూహాన్ని అమలు చేసిన అమిత్‌ షా.. ముందుగానే బిల్లుకు సంబంధించిన వాటిపై పూర్తి కసరత్తు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాశ్మీర్‌ను పునర్‌విభన చేస్తూ.. మరో బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. లఢఖ్ ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతూ బిల్లును రూపొందించారు. అలాగే చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్‌ కానుంది. గత వారం రోజులుగా భద్రతా బలగాల మోహరింపుతో కల్లోలంగా మారిన కాశ్మీర్‌ వ్యవహారం కీలక ప్రకటనతో ముగిసింది.

అమిత్‌ షా ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యంగాన్ని ఉల్లంఘించి ఈ నిర్ణయం తీసుకుందని తీవ్రంగా మండిపడ్డాయి. 370 రద్దుపై సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా దేశానికి సమస్యగా మారిన కశ్మీర్‌ ప్రత్యేక హక్కుల అధికరణను తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ర్టికల్‌ 370పై పక్కా వ్యూహాన్ని అమలు చేసిన అమిత్‌ షా.. ముందుగానే బిల్లుకు సంబంధించిన వాటిపై పూర్తి కసరత్తు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాశ్మీర్‌కు సమస్యాత్మకంగా మారిన ఆర్టికల్‌ 35ఏ, 370 అధికరణలను రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలో అమిత్‌ షా ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పూర్తి బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈమేరకు కీలక ప్రకటన చేసింది.

 

 

Similar News