జగన్ దూకుడుతో పోలవరం ప్రమాదంలో పడినట్లేనా?!

Update: 2019-08-20 04:07 GMT

ఏపీ సీఎం జగన్ దూకుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును ప్రమాదంలో పడేస్తుందా?. అంటే తాజా పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. జగన్ సర్కారు కనీస నిబంధనలు పాటించకుండా మొండిగా వ్యవహరించటం వల్ల ఇఫ్పుడు ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. నిజంగా చంద్రబాబు జమానాలో ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు నిపుణుల కమిటీ నివేదిక నిగ్గుతేలిస్తే చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ ప్రభుత్వంలో ప్రతి దానికి ఓ పద్దతి ఉంటుంది. అది ఫాలో కాకపోతే తిప్పలు తప్పవు. ఇప్పుడు అదే జరుగుతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వారి సహకారంతో ముందుకు సాగాల్సిన జగన్ సర్కారు కేంద్ర ఆదేశాలను ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఆథారిటీ (పీపీఏ)ను కూడా డోంట్ కేర్ అనేలా ముందుకు సాగటం చూసి అధికార వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్న నవయుగా సంస్థ హైకోర్టును ఆశ్రయించటంతో మొత్తం పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడినట్లు అయింది.

ఎందుకంటే తాజాగా జగన్ సర్కారు పోలవరం హెడ్ వర్క్స్ తోపాటు విద్యుత్ ప్రాజెక్టు కాంపోనెంట్ ను కలిపి ఒకే టెండర్ గా పిలిచింది. జగన్ ఎంత సేపు తాను ముందుకు ప్రకటించినట్లు ప్రజా ధనాన్ని ఆదా చేశాననే చెప్పుకునే తాపత్రయంలో నిబంధనలు పాటించకుండా చేయటం వల్ల అసలు ప్రాజెక్టే ప్రమాదంలో పడే పరిస్థితి తీసుకొచ్చినట్లు అవుతుందని ఇంజనీరింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిన పనుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయని..పైగా ఇది కోట్ల రూపాయలతో కూడిన అంశం కావటంతో ఏ సంస్థ అయినా ఎందకు ఉపేక్షిస్తుందని ప్రశ్నిస్తున్నారు. నవయుగా కేసులో హైకోర్టు కనున ‘స్టే’ ఇస్తే పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడినట్లేనని..అదే సమయంలో కేంద్రం కూడా జగన్ సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు,,పీపీఏను ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం.

 

Similar News