సీబీఐకి చిక్కని చిదంబరం!

Update: 2019-08-20 15:54 GMT

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం మంగళవారం నాడు సీబీఐ అధికారులకు చిక్కకుండా తప్పించకున్నారు. ఆయనకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించటం, ఆయన నివాసానికి ఆరుగురు సీబీఐ అధికారుల బృందం వెళ్లటం చకచకా సాగాయి. అయితే చిదంబరం తన నివాసంలో లేకపోవటంతో సీబీఐ అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు 305 కోట్ల రూపాయల విదేశీ నిధులు మళ్ళించేందుకు అనుమతి ఇవ్వటంలో చిదంబరం పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం 2007లో జరిగింది.

అప్పట్లో ఆయన అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పలుమార్లు విచారణ సంస్థల ముందు హాజరయ్యారు. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం దరఖాస్తు చేసుకోగా..చట్టసభ సభ్యుడైనంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించి..పిటీషన్ ను కొట్టేసింది. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం సుప్రీం గడప తొక్కనున్నట్లు సమాచారం.

Similar News