తెలుగుదేశం పార్టీని వీడేదిలేదని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స్పష్టం చేశారు. ఆయన మంగళవారం నాడు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడితో సమావేశం అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారే వాడిని అయితే చంద్రబాబుతో ఎందుకు సమావేశం అవుతానని..వైసీపీలోకి వెళ్లాలనుకుంటే తాడేపల్లి, బిజెపిలోకి అయితే ఢిల్లీ వెళ్ళేవాడిని కదా? అని వ్యాఖ్యానించారు.
టీడీపీకి పునర్ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలాగా తన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. ఏదైనా ధైర్యంగా చెప్పే చేసే అలవాటు తనకు ఉందని అన్నారు. ఈ వయస్సులో కూడా బంగీ జంప్ చేసే సాహసం తనకు కూడా ఉందని..అలా చేసిన వారిలో చిరంజీవి, జగన్, తర్వాత తానేనని తెలిపారు. బంగీ జంప్ గురించి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేశారని చెప్పారు.