‘అమరావతి’కి ప్రపంచ బ్యాంకు రుణం ‘నో’

Update: 2019-07-19 04:24 GMT

ప్రపంచ బ్యాంక్ అసలు విషయం తేల్చేసింది. అమరావతికి రుణం ఇవ్వటం సాధ్యంకాదని పేర్కొంది. సమగ్ర తనిఖీకి సర్కారు అనుమతించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏపీలో ప్రభుత్వం మారి..కొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘అమరావతి’ ప్రణాళికల్లో భారీ మార్పులు ఉండే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వ హయంలో జరిగిన రాజధాని గోల్ మాల్ కు సంబంధించిన అంశంపై మంత్రుల కమిటీ పరిశీలన చేస్తోంది. అయితే ప్రపంచ బ్యాంకు రుణం ఆగిపోవటం వల్ల ఇప్పటికిప్పుడు పెద్దగా అమరావతికి వచ్చిన నష్టం ఏమీ ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

వాస్తవానికి అమరావతి నిర్మాణం కోసం ఏపీ సర్కారు ప్రపంచ బ్యాంకు నుంచి 7200 కోట్ల రూపాయల రుణం పొందాలని చూశారు. అయితే ఇది వివిధ దశల్లో తీసుకోవాలని ప్రతిపాదించారు. కానీ ప్రపంచ బ్యాంకు పలుమార్లు తనిఖీలు నిర్వహించి గత టీడీపీ సర్కారును వివరణలు కోరింది. రాజధాని భవనాలతోపాటు రహదారులు, ఇతర మౌలికసదుపాయాల కల్పన కోసం ఈ రుణాన్ని వాడుకోవాలని తొలుత ప్రతిపాదించారు.

 

 

 

Similar News