తెలంగాణ ఐపీఎస్ పొలిటికల్ కామెంట్స్..కలకలం

Update: 2019-07-24 08:56 GMT

సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రింటింగ్ & స్టేషనరరీ డీజీ వికె సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ చెబుతున్న ‘బంగారు తెలంగాణ’ నినాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓ సీనియర్ అధికారి రాజకీయ వ్యాఖ్యలు చేయటంతో దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందా? అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పోలీస్ వ్యవస్థ వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదన్నారు. .ప్రభుత్వం తో ఎలాంటి సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రింటింగ్, స్టేషనరీ,స్టోర్స్ కమిషనర్ గా కొనసాగుతూ సాంఘిక సంక్షేమం కోసం పని చేస్తానని పేర్కొన్నారు. ఈ శాఖను మూసేయవచ్చని..అసలు ఇక్కడ పనేమీలేదన్నారు. జైళ్ళ డిజి గా పనిచేసి ఎన్నో సంస్కరణలు తెచ్చాను. ఆనంద ఆశ్రమం తో 15 వేల మంది బెగ్గర్స్ కు ఆశ్రయం ఇచ్చాం.

ఇది నాకు చాలా ఆనందం కలిగించిన అంశం జైల్లో అనేక నూతన మార్పులు తీసుకొచ్చాము. నేను సెలవులో ఉన్నప్పుడు నన్ను నన్ను స్టేషనరీ,ప్రింటింగ్, స్టోర్స్ కమిషనర్ గా బదిలీ చేశారు. పదవుల కోసం నేను పని చేయడం లేదు పోలీస్ వ్యవస్థ ను మార్చడానికి నేను పోలీస్ డిపార్ట్ మెంట్ కు రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే పోలీస్ డిపార్ట్ వచ్చాను. అనేక ప్రభుత్వ శాఖల్లో పని చేసాను పోలీస్ వ్యవస్థ లో మార్పులు అవసరం స్టేషనరీ,ప్రింటింగ్, స్టోర్స్ ప్రస్తుతం 50 కోట్లు అప్పు ఉంది. 2 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది. నన్ను బదిలీ చేయడం తో చాలా మంది జైలు ఉద్యోగులు బాధపడ్డారు ప్రింటింగ్,స్టేషనరీ కమిషనర్ గా నియమించడం నాకు బాధ కలిగించిందని తెలిపారు.

Similar News