ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్

Update: 2019-07-23 04:29 GMT

ఏపీ అసెంబ్లీలో తొలి ‘సస్పెన్షన్’ నమోదు అయింది. మంగళవారం ఉదయం సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తున్నారనే కారణంతో టీడీపీ సీనియర్ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి లను సస్పెండ్ చేస్తూ ఉప సభాపతి రఘుపతి ఆదేశాలు జారీ చేశారు. ఈ సెషన్ మొత్తం వీరిని సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించగా..సభ ఆమోదంతో కోన రఘుపతి ముగ్గురు టీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

స్పీకర్ చైర్ ను లాగటంతో పాటు ఉప సభాపతిని అవమానించేలా వ్యవహరించారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సస్పెండ్ అయిన సభ్యులను మార్షల్స్ సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అత్యంత కీలకమైన బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ కావాలనే ఈ రగడ చేస్తోందని మంత్రులు ఆరోపించారు. ఈ బిల్లుల సభ ఆమోదం పొందితే ఎక్కడ జగన్ సర్కారుకు మంచి పేరు వస్తుందో అన్న ఆందోళన టీడీపీలో కన్పిస్తోందని విమర్శించారు.

 

Similar News