సాహో వీడియో సాంగ్ విడుదల

Update: 2019-07-08 05:55 GMT

రెబెల్ స్టార్ ప్రభాస్..బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సినిమా ‘సాహో’. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ‘సయ్యా సైకో’ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ పాట అర్ధం కాకుండా ఉన్నా..ఇందులో ప్రభాస్..శ్రద్దా కపూర్ డ్యాన్స్ లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. టేకింగ్ లో రిచ్ నెస్ పాటలో స్పష్టంగా కనపడుతోంది.

ఇప్పటికే విడుదల చేసిన సాహో టీజర్ కొత్త రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి సాహో పాటను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచిచూడాల్సిందే. సాహో సినిమాకు సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ విలన్‌గా నటిసస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=G81Ospnlctw&feature=youtu.be&fbclid=IwAR3Gp8CkYkuFd72zCficXLcbkupVald2yxoYcaGysVV5YGVVVe0gsz6s2QI

 

Similar News