ఇరవై రోజుల్లో మీ అక్రమాలు అన్నీ వెలుగులోకి..జగన్

Update: 2019-07-19 04:38 GMT

పోలవరం ప్రాజెక్టు విషయంలో శుక్రవారం నాడు కూడా అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరిగింది. చర్చలో జోక్యం చేసుకున్న సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి సాగిందని ఆరోపించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో అన్నీ బయటకు వస్తాయి ఉండండి అని వ్యాఖ్యానించారు. మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి నామినేషన్ పై పనులు అప్పగించారని అన్నారు. పోలవరం విద్యుత్ ప్రాజెక్టుల టెండర్ లో కూడా గోల్ మాల్ జరిగిందని..అసలు పనులు మొదలుపెట్టకుండా ఆ సంస్థకు చంద్రబాబు సర్కారు వందల కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇఛ్చిందని తెలిపారు. చంద్రబాబు తనకు కావాల్సిన నవయుగాకు పనులు అప్పగించారన్నారు.

టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేశారా? అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో కేవలం మట్టి పనులు మాత్రమే జరగ్గా..తమ హయాంలో నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయని తెలిపారు. మంత్రి అనిల్ వివరణ ఇఛ్చిన తర్వాత జగన్ కూడా దీనిపై స్పందించారు. ప్రస్తుతం గోదావరిలో వరద వస్తుందని..ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభం అవుతాయిని తెలిపారు. గత ప్రభుత్వంలో స్పిల్ వే పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 15నుంచి 20 శాతం ఆదా అయ్యేఅ అవకాశం ఉందన్నారు.

 

 

Similar News