పీఏసీ పదవి పయ్యావులదే

Update: 2019-07-24 14:36 GMT

అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి పయ్యావుల కేశవ్ ను వరించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా ఈ పదవి కోసం పోటీ పయ్యావుల, గంటా మధ్యే సాగగా..చివరకు చంద్రబాబు పయ్యావుల వైపు మొగ్గుచూపారు.

అసెంబ్లీ నిబంధనల ప్రకార ప్రతిపక్ష పార్టీకే పీఏసీ పదవి ఇస్తారు. పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పీఏసీ ఛైర్మన్ గా వ్యవహరించారు.

 

Similar News