జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ కు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక పదవులు కట్టబెట్టారు. ఆయన్ను పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించటంతో పాటు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. పొలిట్ బ్యూరోలో నాదెండ్ల మనోహర్ తోపాటు పి.రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్తంఖాన్ ఉన్నారు.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్, కొణిదెల నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, డాక్టర్ పసుపులేటి వరప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, ఎ. భరత్ భూషణ్, బి. నాయర్ లు ఉన్నారు. క్రమశిణ కమిటీ ఛైర్మన్ గా మాదాసు గంగాధరంను నియమించారు.