జగన్ పై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Update: 2019-07-11 05:14 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వ్యవస్థను కడిగేద్దాం. నా స్థాయిలో నేను శుభ్రం చేయటం ప్రారంభించా. అందరూ ఈ దిశగా నడవాలి’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది.

పత్రికల్లో వచ్చిన వార్తను జత చేస్తూ జగన్ పై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వ్యవస్థను కడిగేముందు మనని మనం కడుకోవాలి జగన్ గారు. కడిగిన ముత్త్యాలు మాత్రమే వ్యవస్థను కడగగలవు. ఈడీ, సీబీఐ కేసులువున్న మీరు ఎలా కడగగలరు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 

 

Similar News