‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ

Update: 2019-07-18 06:47 GMT

ఒక సిమ్ లో నుంచి మరో సిమ్ లోకి డాటా ట్రాన్స్ ఫర్ చాలా ఈజీ. అలాంటిది ఒక మెదడులో నుంచి మరో మెదడులోకి డాటా ట్రాన్స్ ఫర్ చేయవచ్చా?. అది అసలు సాధ్యం అవుతుందా?. చనిపోయిన వ్యక్తి మెదడులోని డాటాను బతికున్న వ్యక్తి మెదడులోకి ట్రాన్స్ ఫర్ చేస్తే..బతికున్న వ్యక్తి మెదడులోని డాటా అంతా తొలగిపోయి..చనిపోయిన వ్యక్తి డాటా అంతా వస్తుందా?. అత్యంత కీలకమైన ఓ కేసును దర్యాప్తు చేసే అధికారి అకస్మాత్తుగా చనిపోతే ఈ కేసును చేధించటం ఎలా?. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో అచ్చం ఇదే జరిగింది. ఈ సినిమాలో ఏదైనా కాస్త కొత్త లైన్ ఏదైనా ఉందీ అంటే ఇదే. ఈ లైన్ తో దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాను నడిపించేశారు. మిగతా కథలో ఎక్కడా కొత్తదనం కన్పించదు. అవే కుట్రలు...అవే ఎంక్వైరీలు..అవే ఫైటింగ్ లు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను పూరీ జగన్నాథ్ పూర్తిగా మాస్ ను టార్గెట్ చేసుకుని తీశారనే విషయం స్పష్టం అవుతోంది.

అయితే ఈ సినిమాలో హీరో రామ్ ఎనర్జీ లెవల్స్ మరో స్థాయికి వెళ్ళాయనే చెప్పొచ్చు. రౌడీ శంకర్ గా మాస్ పాత్రలో రామ్ దుమ్మురేపాడనే చెప్పొచ్చు. హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ అందాల ఆరబోత కూడా ఓ రేంజ్ లో ఉంది. నటనలో ఎంతో పరిణితి ఉన్న నభా నటేష్ తో ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ఏకంగా బూతులు మాట్లాడించారు. ఆమె రోల్ కూడా చాలా రఫ్ గా డిజైన్ చేశారు. నిధి అగర్వాల్ తొలుత ఎలుకలపై ఈ డాటా ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన ప్రయోగం చేస్తుంది. కానీ సీబీఐ ఆఫీసర్ ఒత్తిడితో కేసు విచారణాధికారిగా ఉన్న తన లవర్ సత్యదేవ్ ఓ దాడిలో చనిపోవటంతో ఆమె కూడా అందుకు ముందుకు వస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లో కామెడీ అనేది ఎక్కడా కన్పించదు. ఓవరాల్ గా చూస్తే ‘ఇస్మార్ట్ శంకర్’ పూర్తి మాస్ మసాలా సినిమా.

రేటింగ్. 2.5/5

 

 

Similar News