నిజాయతీగా బతికా..ఏ విచారణకైనా సిద్ధం

Update: 2019-07-15 04:32 GMT

‘నిజాయతీగా బతికా. ఏ విచారణకైనా సిద్ధమే’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించగా..అధికార వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. గొడవ చేస్తే ఉపయోగం ఉండదని..గతంలోనూ తన మీద విచారణ కమిటీలు వేశారని అన్నారు. ఈ అంశంపై తాను తర్వాత మాట్లాడతానని..రాష్ట్రానికి ఏది మంచో దాని కోసమే తాను విదేశీ పర్యటనలు చేశానని చెప్పారు.

ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వమే తన నివేదికలో ఒప్పుకుందని..మరో 16 లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగాయని... ఈ ఒప్పందాలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడులు వేల కోట్లు..ఉద్యోగాలు కోట్లు అని ప్రచారం చేసుకున్నారని..ఇఫ్పుడు అవేమీ కన్పించలేదన్నారు.

 

Similar News