ఆగస్టు 2న ‘గుణ369’ విడుదల

Update: 2019-07-04 15:43 GMT

కార్తికేయ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో ఆయనకు అవకాశాలు కూడా అంతే వస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘హిప్పీ’ బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. మరి మూడవ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమానే ‘గుణ369’. ఆగస్టు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ సినిమా నిర్మాతలు. గుణ 369 షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. నిర్మాణానంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావ‌డానికి స‌ర్వం సిద్ధం చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Similar News