ఒక వ్యక్తిలో అసలు రెండు బుర్రలు సాధ్యమా?. ఒకరు ఒక వైపు లాగుతుంటే ఇంకొరు మరో వైపు లాగుతారా?. ఒకే మనిషిలో రెండు బుర్రలు ఉంటే వాటి సంఘర్షణ ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా కథ. టీజర్..ట్రైలర్ లోనే దర్శకుడు సినిమా లైన్ చెప్పేశాడు. సినిమా మధ్యలో మధ్యలో వచ్చే డైలాగ్ లు ఆకట్టుకున్నా కథను విజయవంతంగా నడిపించటంలో దర్శకుడు తడబడ్డాడనే చెప్పాలి. వెరసి మంచిగా నటించగలితే సత్తా ఉండి..చాలా మంది నటులతో పోలిస్తే ఎన్నో రకాలుగా ఈజ్ ఉన్న హీరో అయిన ఆది సాయికుమార్ పోరాటం ఇంకా సాగాల్సినట్లే కన్పిస్తోంది. ఆయన సినిమాలు వెండితెరమీదకు వచ్చి కూడా చాలా కాలం అయింది. ఇంత గ్యాప్ తీసుకుని సినిమా చేసినా అది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే అభిరామ్(ఆది సాయికుమార్) పుట్టుకతోనే రెండు మెదళ్లు ఉండటంతో రెండు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దీంతో అభిరామ్ కాస్త అభి, రామ్‌గా భిన్న వ్యక్తిత్వాలతో లైఫ్ గడిపేస్తూ ఉంటారు. ఏవైనా పెద్ద శబ్దాలను విన్నప్పుడు అభి, రామ్‌గా.. రామ్ అభిగా మారిపోతూ ఉంటారు. ఒక్కరిగానే పుట్టినా.. ఇద్దరిలా పెంచుతారు ఈశ్వర్‌ప్రసాద్ (రాజేంద్రప్రసాద్). వ్యతిరేక ధృవాలుగా ఉన్న అభి, రామ్ ఎప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారో అని ఈశ్వర్ ప్రసాద్ ఎదురుచూస్తు ఉంటాడు.
అభిరామ్ జీవితంలోకి హ్యాపీ (మిస్త్రీ చక్రవర్తి), గగన్ విహారి(అభిమన్యు సింగ్) రాకతో ఎలాంటి చిక్కులు వచ్చాయి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అన్నద సినిమా. అభిగా అల్లరిచిల్లరగా తిరిగే పాత్రకు, రామ్ లాంటి డీసెంట్ క్యారెక్టర్‌కు తన నటనతో వేరియేషన్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటనకు వంకలు పెట్టడానికి చాన్సేలేదు. హాస్యాన్ని పండించడమే కాదు, ఎమోషన్స్ సీన్స్‌లోనూ తన అనుభవాన్ని చూపించాడు. హీరోయిన్‌గా మిస్త్రీ చక్రవర్తి పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. లుక్స్ పరంగా ఓకే అనిపించింది. మరో హీరోయిన్ అయిన నైరాషా కనిపించిన రెండు మూడు సీన్స్‌లో ఫర్వాలేదనిపించింది. రచయితలు దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కించడం టాలీవుడ్ లో గత కొంత కాలంగా సాగుతోంది. అయితే అందులో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు వెనకబడ్డారు. అయితే డైలాగ్ రైటర్‌గా మంచి పేరున్న డైమండ్ రత్నబాబు.. ఈ చిత్రంలో కూడా మంచి పంచ్ డైలాగ్‌లను రాశాడు. కంటెంట్ కంటే కామెడీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన రత్నబాబు.. సినిమాను ఒకింత ఎంటర్‌టైనర్‌గా మలచడంతో సక్సెస్ అయ్యాడు.
ఇదే పాయింట్‌తో ఓ ప్రయోగం చేసే అవకాశం ఉన్నా.. కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించిడంతో ఏమంత కొత్తగా ఉండదు. పైగా స్క్రీన్ ప్లే కూడా అంత ప్రభావవంతంగా అనిపించదు. ప్రతీ సన్నివేశం అతికించినట్లు అనిపిస్తుంది. రత్నబాబు రచయితగా సక్సెస్ అయినా.. దర్శకుడిగా మాత్రం తడబడ్డాడు. కథలో ఏం జరగబోతోంది అన్నది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. కెమెరామెన్ ప్రతి సన్నివేశాన్ని తెరపై అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే బుర్రకథ కన్ప్యూజ్ సినిమాగా మిగులుతుంది.
రేటింగ్.2.5\5