పీపీఏల సమీక్షపై జగన్ సర్కారు హైకోర్టు ఝలక్

Update: 2019-07-25 09:55 GMT

ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్షకు బ్రేక్ పడింది. ఈ ఒప్పందాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని..ప్రజలపై భారం పడిందని ఆరోపిస్తూ జగన్ సర్కారు ఈ ప్రాజెక్టులపై సమీక్షకు నిపుణుల కమిటీతోపాటు మంత్రుల కమిటీని కూడా నియమించింది. దీనిపై అటు కేంద్ర మంత్రి, అధికారులు కూడా జగన్ సర్కారుకు లేఖలు రాశారు. అయినా సరే ఏపీ సర్కారు మాత్రం ముందుకెళ్ళటానికే నిర్ణయించుకుంది. రేటింగ్ ఏజెన్సీలు..పారిశ్రామికవర్గాలు సర్కారు నిర్ణయంపై తీవ్రంగా స్పందించాయి. చివరకు పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

కంపెనీల వాదనలు విన్న హైకోర్టు పీపీఏ సమీక్షపై నాలుగు వారాల స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 40 సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. తాము అన్నీ నిబంధనల ప్రకారమే ఒఫ్పందాలు చేసుకున్నామని..గతంలో చెల్లించిన మొత్తాలపై కూడా సమీక్ష అంటూ సర్కారు నిర్ణయించటం సరికాదని కంపెనీలు వాదించాయి. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సర్కార్ ను ఆదేశించిన హైకోర్టు కేసును తదుపరి వాదనల కోసం ఆగస్టు 22కి వాయిదా వేసింది. చంద్రబాబు ప్రభుత్వం కొన్ని కంపెనీలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది కల్పించారనేది జగన్ సర్కారు ఆరోపణ.

 

 

 

Similar News